జూలై 18వ తేది నుండి జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

✒️జులై 18నుండి 28వ తారీకు వరకు  

✒️యువకులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి 

✒️అరకు పార్లమెంట్ జనసేన అధ్యక్షులు పాడేరు ఇంచార్జ్  

👉డాక్టర్ వంపూరి గంగులయ్య

(స్టాఫ్ రిపోర్టర్ మాదిరి చంటిబాబు )పాడేరు,గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై 15:రాష్ట్రవ్యాప్తంగా జులై18 వ తారీకు నుండి 28వ తారీకు వరకు జనసేన పార్టీ చేపట్టినటువంటి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని యువత సద్వినియోగం చేసుకొని కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడానికి కృషి చేయాలని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అరకు పార్లమెంట్ జనసేన పార్టీ అధ్యక్షులు పాడేరు ఇంచార్జ్ డాక్టర్ వంపూరి గంగులయ్య పిలుపునిచ్చారు. క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే కలిగే ప్రయోజనాలను వివరించారు.ప్రమాదవశాత్తు ఏమైనా జరగకూడనిది జరిగితే కుటుంబానికి ఎంతో కొంత చేయూతనివ్వటానికి ఉపయోగపడట మనేది ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు ముఖ్య ఉద్దేశమని అన్నారు.500 రూపాయలు కట్టి క్రియాశీలక సభ్యత్వం పొందడం వల్ల ప్రమాదం జరిగి ఆసుపత్రి పాలైతే 50వేల రూపాయల వరకు మెడికల్ పాలసీ వర్తిస్తుందని,

IMG-20240715-WA0011
అరకు పార్లమెంట్ జనసేన పార్టీ అధ్యక్షులు @ పాడేరు ఇంచార్జ్ డాక్టర్ వంపూరి గంగులయ్య

అలాగే ప్రమాదంలో జరగకూడనిది జరిగి మరణం సంభవిస్తే ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు.జనసేన పార్టీ ఏర్పాటు చేయబోయే కమిటీలలో క్రియాశీలక సభ్యత్వం పొందిన వారికి అవకాశం ఉంటుందని,పార్టీతో అనుబంధం ఎప్పుడు వారికి ఉంటుందని గంగులయ్య తెలిపారు.కాబట్టి క్రియాశీలక సభ్యత్వం పొందటం ఒక గౌరవం అని అన్నారు.జూలై 18 నుండి 28 వరకు జరిగే క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో క్రియా శీలక సభ్యత్వం పొందాలని దానిద్వారా పొందే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ గంగులయ్య మీడియా ద్వారా పిలుపునిచ్చారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల