గూడెం కొత్త వీధి,పెన్ పవర్,డిసెంబర్ 4:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలంలోని కేజీబీవీ పాఠశాలలో మెగా పిటీఎం 3.0 కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గూడెం కొత్త వీధి ఎస్సై సురేష్ ముఖ్య అతిథిగా హాజరై పలువురు తల్లిదండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్సై సురేష్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను ఎప్పుడూ స్నేహపూర్వకంగా చూడాలని, “నేను తండ్రిని… నేను తల్లిని…” అనే భావంతో పిల్లలపై అసమాయిషి చేయకూడదని సూచించారు. పిల్లలు తెలిసి తెలియక తప్పులు చేసినపుడు ప్రేమగా మాట్లాడి, వారి లోపాలను సరిదిద్దేలా మార్గనిర్దేశం చేయాలని అన్నారు. తల్లిదండ్రులు ప్రేమగా మాట్లాడితే పిల్లలు తప్పుడు మార్గాల్లోకి వెళ్లే అవకాశం ఉండదని సూచించారు.పిల్లలకు తమ తల్లిదండ్రులేగొప్ప అన్నా భావన కలిగేలా తీరు మార్చాలని, గత తరం–ఇప్పటి తరాల మధ్య ఉన్న వ్యత్యాసాలను అర్థం చేసుకుని పిల్లలతో వ్యవహరించాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా పిల్లలు చదువుకుంటూ భవిష్యత్తులో స్థిరపడేలా ప్రోత్సహించాల్సిన అవసరాన్ని వివరించారు. అలాగే పిల్లల ఆసక్తి, ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఆయన పేర్కొన్నారు.పిల్లలను తరచూ దూషిస్తే మొండితనం పెరిగే ప్రమాదం ఉన్నందున, వారు తప్పు చేసినప్పుడు శాంతంగా, వివరించి చెప్పాలని అభిప్రాయపడ్డారు. బాల్యవివాహాలను అరికట్టాలని, బాల్యవివాహాలు పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తాయని హెచ్చరించారు. గంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై కూడా తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ దుమంతి సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ చిన్నబ్బాయి, పాఠశాల ప్రిన్సిపల్ నాగలక్ష్మి, స్కూల్ కమిటీ చైర్మన్, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
- లైఫ్ స్టైల్ / Life style
- అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District
- స్పెషల్ ఆర్టికల్స్
- కెరీయర్