ఏజెన్సీ ముద్దుబిడ్డ కామ్రేడ్ కుంజ బోజ్జి వర్ధంతి

ఏజెన్సీ ముద్దుబిడ్డ కామ్రేడ్ కుంజ బోజ్జి వర్ధంతి

చింతూరు

అమరజీవి కామ్రేడ్ కుంజా బుజ్జి తృతీయ వర్ధంతి సందర్భంగా శ్యామల వెంకటరెడ్డి కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సేసం సురేష్ నాయకులు వెంకట్ మాట్లాడుతూ ఏజెన్సీ ముద్దుబిడ్డ కామ్రేడ్ కుంజ బొజ్జి. ఏజెన్సీలో చేసిన సేవలు మరువలేని అన్నారు. సీలేరు జల విద్యుత్ కేంద్రంలో కాంటాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయించే విషయంలో ఎంతో కృషిచేసి క్రమబద్ధీకరణ చేయించారన్నారు. నిత్యం పార్టీ ఎదుగుదల కోసం నిరుపేదల కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన అమరజీవి కుంజా బో జ్జి అని కొనియాడారు. నేటి తరానికి అతను ఒక నిదర్శనమని అతని ఆశయ సాధనలోనే అందరూ పిడికిళ్ల బిగించాలని సమస్యలపై పోరాడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం అతని చిత్రపటానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, పల్లపు వెంకట్, కారం సుబ్బారావు, పోడియం లక్ష్మణ్, బీరబోయిన దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

LatestNews

ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 
భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు 
యూటిఎఫ్ సభ్యులుగా చేరి – ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించండి