గూడెం కొత్త వీధి,పెన్ పవర్,సెప్టెంబర్ 10:స్వతంత్ర భారతావనికి 78 సంవత్సరాలు పూర్తయిన ఈ సమయంలోనూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న దారకొండ ప్రాంతాన్ని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, అల్లూరు జిల్లా చింతపల్లి ఏఎస్పీకి దారకొండ మండల సాధన సమితి సభ్యులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దారకొండ మండలంగా ఏర్పడితే ఆ పరిధిలోని 6 పంచాయతీలు సమగ్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ప్రాథమిక సౌకర్యాలకు కూడా నోచుకోక ఇబ్బంది పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల సాధన సమితి అధ్యక్షులు జగన్, పీసా అధ్యక్షులు రాంబాబు, గౌరవ అధ్యక్షులు సుంకరి విష్ణుమూర్తి, మాజీ సర్పంచ్ అల్లంగి రాజు, బై శెట్టి సుందర్రావు, బలరాం, నారాయణ, సాయి, రాజు తదితరులు పాల్గొన్నారు. సంబంధిత అధికారులు ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించాలని సభ్యులు కోరారు.