గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఆగస్ట్ 29: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండల వ్యవసాయ అధికారిగా డి. గిరిబాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.విజయనగరం జిల్లాకు చెందిన గిరిబాబు, ఇక్కడి వ్యవసాయ అధికారిగా పని చేసిన టి. మధుసూదన్ రావు నుండి అధికార బాధ్యతలు తీసుకున్నారు. మధుసూదన్ రావు తాజాగా చింతపల్లి మండలానికి బదిలీ అయిన విషయం తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన అనంతరం డి.గిరిబాబు మండలంలోని గ్రామ వ్యవసాయ సహాయకులు (విఎఎ) మరియు గ్రామ ఉద్యానవన సహాయకులు (విహెచ్ఎ)లతో సమావేశమై, అధికార పనితీరుపై చర్చించారు.రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సమిష్టిగా పనిచేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు