ఎన్నికల కోడ్ ను అతిక్రమిస్తే కేసులు తప్పవు

ఎన్నికల కోడ్ ను అతిక్రమిస్తే కేసులు తప్పవు

మోతుగూడెం

ఎన్నికల కోఢ్ అతిక్రమిస్తే కేసులు తప్పవని అంటున్న డొంకరాయి ఎస్సై శివకుమార్, తన సిబ్బందితో వై. రామవరం మండలం బొడ్డగండి గ్రామ పంచాయితీ డొంకరాయి గ్రామంలోనీ హాస్పిటల్ క్యాంప్ లో రాబోయే సార్వత్రిక ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సభలో ఎస్సై మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఎన్నికల కోడ్ ను అనుసరించాలని, కోడ్ అతిక్రమించిన వారిపై కేసులు నమోదు అవుతాయని తెలిపారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు సజావుగా సాగేలా సహకరించాలని కోరారు. మావోయిస్టుల వంటి సంఘ విద్రోహ శక్తులకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువత గంజాయి వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా వుండాలని తెలిపారు. అనంతరం హాస్పిటల్ క్యాంప్ గ్రామ యువతకు డొంకరాయి ఎస్సై శివ కుమార్ వాలీబాల్ కిట్ అందించి, పిల్లలకు బిస్కెట్స్, పెద్దలకు డ్రింక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ కళ్యాణ్, రైటర్ శ్రీనివాస్ కానిస్టేబుల్ కన్నప్ప రెడ్డి, గ్రామస్తులు  పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల