గూడెం కొత్త వీధి పెన్ పవర్ ఆగస్టు 12: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 31 పదవులను భర్తీ చేస్తూ లిస్టు విడుదల చేసింది.అందులో అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పార్లమెంట్,పాడేరు అసెంబ్లీ ఇంచార్జ్ డాక్టర్ వంపూరి గంగులయ్యకు రాష్ట్ర ప్రభుత్వం జానపద కళలు మరియు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ వంపుూరు గంగులయ్య జనసేన పార్టీ స్థాపించినప్పటి నుండి పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎంపీగా పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన అరకు పార్లమెంట్, పాడేరు అసెంబ్లీ ఇన్చార్జిగా వ్యవహరిస్తూ క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ విస్తరణకు విశేషంగా కృషి చేస్తున్నారు. డాక్టర్ వంపూరు గంగులయ్యకు ఈ పదవి వరించటంపై పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.