బిజెపి నేత దుక్కెరి ప్రభాకర్ కు పితృవియోగం

గూడెం కొత్త వీధి, పెన్ పవర్, ఆగస్టు 14: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం దామనాపల్లి పంచాయతీ సిగనాపల్లి రాంనగర్ కాలనీ గ్రామానికి చెందిన దుక్కెరి ప్రభాకర్ యొక్క తండ్రి సీనియర్ బిజెపి నాయకులు దుక్కిరి జ్ఞానేశ్వర్ రావ్ విశాఖపట్నం కెజిహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నవి. దుక్కెరి జ్ఞానేశ్వర్ రావ్ బిజెపి పార్టీలో వివిధ పదవులను అలంకరించారు. అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన సిగినాపల్లి రాంనగర్ కాలనీ వద్ద మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహిస్తున్నట్లు కుమారుడు దుక్కెరి ప్రభాకర్ తెలిపారు.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.