నేలపాడు వాటర్ ట్యాంక్ పైన పై కప్పు ఏర్పాటు చేయాలి

IMG-20240714-WA0004
నేలపాడు వాటర్ ట్యాంక్

👉కలుషిత నీరు తాగి అనారోగ్యాల పాలు 

గూడెం కొత్త వీధి పెన్ పవర్ జులై 14: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం రింతాడ పంచాయతీ నేలపాడు గ్రామంలో కలుషిత నీరు తాగి అనారోగ్య పాలవుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమ గ్రామానికి గ్రావిటీ ద్వారా మంచినీటి సౌకర్యం కల్పించినప్పటికీ వాటర్ ట్యాంకుకు పైకప్పు ఏర్పాటు చేయలేదని దీంతో వర్షం పడితే వర్షం నీరు దీంట్లో చేరుతుందని,వర్షం నీరు తాగి అనారోగ్యాల పాలు అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పైకప్పు లేకపోవడం వలన చెత్తాచెదారం,ఇతర క్రిమి కీటకాలు వాటర్ ట్యాంక్ వద్ద చేరే అవకాశం అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పైపుల ఏర్పాటు కూడా గుత్తేదారుడు సరిగ్గా ఏర్పాటు చేయలేదని కావున అధికారులు స్పందించి వాటర్ ట్యాంక్ పైకప్పు ఏర్పాటుచేసి, పైపులు సక్రమంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

 

✒️ పెన్ పవర్ గూడెం కొత్త వీధి 

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల