చింతపల్లి,పెన్ పవర్,ఆగస్టు18:ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని జనసేన పార్టీ నాయకులు పెదపూడి మధు తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజులపాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.వర్షాల కారణంగా జలప్రవాహాలు,కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండొచ్చన్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర కారణాలు తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.వర్షాల సమయంలో పొంగిపొర్లే వాగులు,వంతెనలు దాటకుండా ఉండాలన్నారు.విద్యుత్ తీగలు, చెట్లు దగ్గరగా వెళ్లరాదాని సూచించారు. అలాగే కాచి చల్లార్చిన నీటిని తాగాలని కోరారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని కోరారు.