వినాయక చవితి సందర్భంగా రోడ్లపై తాళ్లు పెట్టడంపై పోలీసులు హెచ్చరిక: సబ్ ఇన్స్పెక్టర్ అప్పలసూరి

గూడెం కొత్తవీధి,పెన్ పవర్ఆ,గస్టు 22:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలోని గ్రామాల్లో వినాయక చవితి వేడుకల సందర్భంగా కొంతమంది యువకులు, ముఖ్యంగా పిల్లలు రోడ్డుకు అడ్డంగా తాళ్లు (తాడు) వేసి చందాలు అడుగుతున్నారు. ఈ చర్యలు రోడ్డుప్రమాదాలకు దారితీయగలవని జి.కె.వీధి పోలీస్‌ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ అప్పలసూరి ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. తాజాగా జాతీయ రహదారులపై కూడా ఈ విధమైన చర్యలు చోటు చేసుకుంటున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వేగంగా ప్రయాణిస్తున్న వాహనాలు అకస్మాత్తుగా అడ్డుపడే తాడును గుర్తించలేకపోవడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశముందని తెలిపారు. ఈ నేపధ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, గ్రామీణ ప్రాంతాల్లో వేడుకలు జరుపుకుంటున్న సమయంలో రోడ్లపై ఇటువంటి అడ్డంకులు కలిగించకుండా ఉండాలని సూచించారు.ప్రత్యేకంగా నేషనల్ హైవేలు, ప్రధాన రహదారులపై తాళ్లు పెట్టడం పూర్తిగా నిషేధించబడిందని, అలాంటి చర్యలు చేపట్టిన వారి మీద చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు.వినాయక చవితిని శాంతియుతంగా, సురక్షితంగా జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు

.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.