చీడి పాలెం లో ఘనంగా విగ్రహ ప్రతిష్ట

చీడి పాలెం లో ఘనంగా విగ్రహ ప్రతిష్ట

గంగవరం (అల్లూరు జిల్లా)

IMG-20240415-WA0100(1)

మండలంలోని చీడి పాలెం లో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామాలయం లో సోమవారం శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. రాజమహేంద్రవరం కు చెందిన ఆంధ్ర వనవాసి కళ్యాణ ఆశ్రమం ప్రతినిధులు రాధాకృష్ణ, పద్మావతి సమకూర్చిన విగ్రహాలను అత్యంత ఘనంగా వేదమంత్రాలు మధ్య విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. గణపతి హోమం అనంతరం ఆలయ వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే రాత్రి శాంతి కల్యాణం నిర్వహించారు.

 

ఈ కార్యక్రమంలో పూజారులుగా విశ్వ రెడ్డి ,బాల్ రెడ్డి వ్యవహరించి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మడకం వెంకటరమణ, ఉపాధ్యాయుడు వెంకన్న దొర ,ఆంధ్ర వనవాసి కళ్యాణ ఆశ్రమం ప్రతినిధులు శ్రీను ,సమరసత సేవా ఫౌండేషన్ కన్వీనర్ చిన్నారావు ,ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల