స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్త వీధి,పెన్ పవర్, నవంబర్ 7:అల్లూరి జిల్లాలో శనివారం అన్ని పాఠశాలలు యధావిధిగా నడుస్తాయని డీఈవో బ్రహ్మాజీరావు శుక్రవారం మీడియాకు తెలిపారు. ముంథా తుఫాన్ కారణం గా ఇచ్చిన సెలవులు భర్తీలో భాగంగా రెండవ శనివారం సెలవును ప్రభుత్వం రద్దు చేసిందని వెల్లడించారు. ప్రైవేట్ పాఠశాలలతో బాటు అన్ని యాజమాన్య పాఠశాలలకు ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు.