విశాఖ నుంచి సీలేరు, భద్రాచలం బస్సులు తిరిగి పునరుద్ధరణ: ఏపీఎస్ఆర్టీసీ విశాఖ ఎండి మాధురి
On  
గూడెం కొత్త వీధి,పెన్ పవర్, అక్టోబర్ 31:మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా గత కొద్ది రోజులుగా రద్దు చేసిన విశాఖపట్నం – సీలేరు –భద్రాచలం బస్సు సర్వీసులు మళ్లీ ప్రారంభమవుతున్నాయి.ఏపీఎస్ఆర్టీసీ విశాఖపట్నం జిల్లా మేనేజర్ మాధురి తెలిపిన ప్రకారం, శనివారం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మీదుగా భద్రాచలం మరియు సీలేరు దిశగా బస్సులు పునరుద్ధరించబడుతున్నాయి.
ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. అదేవిధంగా, రిజర్వేషన్ సదుపాయం అందుబాటులో ఉందని కూడా తెలిపారు.
Tags:  
About The Author
 
                 అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

 
          
          
          
          
                 
                 
                 
                 
                 
                 
                