పద్మనాభ మండల తహసీల్దార్‌కి ఉత్తమ ఉద్యోగి అవార్డు

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ చేతుల మీదుగా కె.ఆనందరావుకి సత్కారం

పద్మనాభ మండలం, పెన్ పవర్ 


79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పద్మనాభ మండల తహసీల్దార్  కె. ఆనందరావుకి "మెరిటోరియస్ అవార్డు" ప్రదానం చేయడం జరిగింది. ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన అందుకున్న ఈ అవార్డు ఆయన సమర్థత, నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది.తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ఆనందరావు  ప్రజల సంక్షేమానికి అనేక అభినం దనీయమైన కార్యక్రమాలను చేపట్టారు. ము ఖ్యంగా ప్రభుత్వ భూముల పరిరక్షణ, రైతులు, పట్టాదారుల పట్ల న్యాయంగా వ్యవహరించడం, సమయానుకూలంగా రెవెన్యూ సేవలు అందిం చడం వంటి అంశాల్లో ఆయన దృష్టిని కేంద్రీకరిం చారు. మండలంలోని ఉద్యోగులను ప్రోత్సహి స్తూ, సమిష్టిగా పని చేసే వాతావరణాన్ని కల్పించారు.
ఈ అవార్డును మండలంలోని ఇతర ఉద్యో గులకు ప్రేరణగా నిలిచేలా చేసిందని స్థానిక ప్రజానాయకులు అభిప్రాయపడ్డారు.

About The Author: SOMA RAJU

సోమరాజు గుమ్మడి, విశాఖపట్నం జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.