స్టాప్ రిపోర్టర్, చింతపల్లి/గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఆగస్టు 21:ప్రభుత్వ ఐటీఐ, చింతపల్లి / అప్పర్ సీలేరు శ్రేణిలో వివిధ ట్రేడులలో మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం మూడవ విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 26, 2025 లోగా www.iti.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సంస్థ ప్రిన్సిపాల్ శ్రీ ఏ. రమణ గారు ఒక ప్రకటనలో తెలిపారు.దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను ఆగస్టు 27, 2025 లోపు దగ్గరలోని ఏదైనా ప్రభుత్వ ఐటీఐ నందు వెరిఫికేషన్ చేయించుకోవలెను. వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులు ఆగస్టు 29, 2025 ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఐటీఐ, చింతపల్లి నందు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో కౌన్సిలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.పూర్తి సమాచారం కోసం ప్రభుత్వ ఐటీఐ, చింతపల్లి నందు ప్రత్యక్షంగా సంప్రదించవచ్చని ప్రిన్సిపాల్ సూచించారు.