పెన్ పవర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన డాక్టర్ వంపూరు గంగులయ్య
పాడేరు,గూడెం కొత్తవీధి,పెన్ పవర్,డిసెంబర్ 31:రాష్ట్ర జానపద కళలు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డాక్టర్ వంపూరు గంగులయ్య పాడేరు పట్టణంలో పెన్ పవర్ పత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం అల్లూరి సీతారామ రాజు జిల్లా పాడేరులో నిర్వహించబడింది.ఈ సందర్భంగా డాక్టర్ వంపూరు గంగులయ్య మాట్లాడుతూ, సమాజంలో ప్రజాస్వామ్య విలువలను, సామాజిక అంశాలను ప్రజలకు చేరవేసే మాధ్యమంగా పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. పెన్ పవర్ పత్రిక సాహిత్యం, సంస్కృతి,ప్రజా సమస్యలపై అవగాహన కల్పించడంలో ముందుండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొర్లె వీర వెంకట్, చింతపల్లి పంచాయతీ జనసేన పార్టీ అధ్యక్షులు సుర్ల వీరేంద్ర కుమార్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.వారు పెన్ పవర్ పత్రిక నిర్వాహకులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ప్రజాదరణ పొందాలని ఆకాంక్షించారు.