దామనపల్లి పంచాయతీ వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యం:కట్టుపల్లి పెసా ఉపాధ్యక్షుడు చెర్రెకి బాలరాజు

ఇప్పటికింకా గ్రామసభ నిర్వహించకపోవటానికి గల కారణమేమిటి?

IMG-20251221-WA1826 ✒️ఇప్పటికింకా గ్రామసభ నిర్వహించకపోవటానికి గల కారణం ఏమిటి? 

గూడెం కోత్త వీధి,పెన్ పవర్, డిసెంబర్ 21:గ్రాIMG-20251221-WA1776 మ పంచాయతీల వికేంద్రీకరణ అమలులోకి వస్తే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని కట్టుపల్లి పెసా ఉపాధ్యక్షుడు చెర్రెకి బాలరాజు అన్నారు. దామనపల్లి పంచాయతీని వికేంద్రీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ స్థాయిలోనే నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజల భాగస్వామ్యం పెరుగుతుందని, ప్రజలు నేరుగా పాలనలో పాల్గొనే అవకాశం లభించి ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని చెప్పారు. స్థానిక సమస్యలపై గ్రామస్థాయి నాయకులకు స్పష్టమైన అవగాహన ఉండటంతో వాటికి త్వరితగతిన సరైన పరిష్కారాలు లభిస్తాయన్నారు.అధికారాలు గ్రామస్థాయికి వస్తే పరిపాలన మరింత సమర్థవంతంగా సాగుతుందని, పనులు ఆలస్యం లేకుండా పూర్తవుతాయని పేర్కొన్నారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య వంటి అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలయ్యే అవకాశముంటుందని తెలిపారు.

వికేంద్రీకరణ వల్ల బాధ్యతాయుత పాలన పెరుగుతుందని, ప్రజలు తమ పంచాయతీ ప్రతినిధులను నేరుగా ప్రశ్నించగలిగే పరిస్థితి ఏర్పడడంతో అవినీతి తగ్గే అవకాశముందని ఆయన అన్నారు. అలాగే గ్రామస్థాయి నాయకత్వం ఎదిగి, మహిళలు, వెనుకబడిన వర్గాలకు పాలనలో భాగస్వామ్యం కలుగుతుందని చెప్పారు.ప్రతి గ్రామ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవచ్చని, ఒకే విధమైన పథకాలకు పరిమితం కాకుండా స్థానిక అవసరాలకు తగిన విధంగా పనులు చేపట్టవచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో దామనపల్లి పంచాయతీ వికేంద్రీకరణపై ఇప్పటివరకు గ్రామసభ నిర్వహించకపోవడంపై కారణం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

బంజారా కాలనీ యువతకు పార్టీ కండువా వేసి బీజేపీలోకి ఆహ్వానించిన కార్పొరేటర్
దామనపల్లి పంచాయతీ వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యం:కట్టుపల్లి పెసా ఉపాధ్యక్షుడు చెర్రెకి బాలరాజు
దామనపల్లి పంచాయతీ వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యం:కట్టుపల్లి పెసా ఉపాధ్యక్షుడు చెర్రెకి బాలరాజు
ఇంటర్ విద్యార్థిని వర్షిత మృతిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పాట్ ఎంక్వైరీకి ఆదేశాలు
చెరువుల అనుసంధానానికి అడ్డంకులు..!
చింతపల్లి ఐటిఐకి నూతన ప్రిన్సిపాల్ గా వై.రామ్మోహన్ రావు బాధ్యతల స్వీకరణ 
పాపన్న గౌడ్ ఆశయ సాధనకు కృషి చేయాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్