క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కూటమి నాయకులు

IMG-20251225-WA1989 గూడెం కొత్త వీధి, డిసెంబర్ 25:

అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలోని వంచుల పంచాయితీ చెరపల్లి గ్రామంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పోత్తూరు కొండలరావు ఆహ్వానం మేరకు కూటమి నాయకులు హాజరయ్యారు.

ఈ వేడుకల్లో జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొర్లె వీరవెంకట్, టిడిపి ఎంపీటీసీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి నాగమణి పాల్గొన్నారు. అలాగే టిడిపి నాయకులు ముర్ల కోటేశ్వరరావు, గాబ్రియేలు, సంతోష్, కుమారి, దేశగిరి గోవిందరావు, గంగాధర్ తదితరులు పాల్గొని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ శాంతి, సౌభ్రాతృత్వం, ప్రేమ సందేశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. అన్ని మతాలు సమానమేనని, పండుగలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.