డాక్టర్ వంపూరు గంగులయ్యకు గొర్లె వీర వెంకట్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించిన జనసైనికులు

గూడెం కొత్తవీధి,పెన్ పవర్, సెప్టెంబర్ 23:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జానపద కళలు సృజనాత్మకత అకాడమీ చైర్మన్‌గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన జనసేన పార్టీ అరకు పార్లమెంట్ పాడేరు అసెంబ్లీ ఇన్చార్జ్ డాక్టర్ వంపూరు గంగులయ్యకు పలువురు జనసేన నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొర్లే వీర వెంకట్ ఆధ్వర్యంలో పార్టీకి చెందిన నాయకులు గంగులయ్యను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. గంగులయ్య తన విస్తృత అనుభవంతో జానపద కళలకు రాష్ట్ర స్థాయిలో పెద్దపీట వేస్తారని, సృజనాత్మకతకు కొత్త దిక్సూచి అవుతారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సమావేశానికి పలువురు పార్టీ ముఖ్యులు, కార్యకర్తలు హాజరై గంగులయ్యకు అభినందనలు తెలుపుతూ, వారి నూతన బాధ్యతల్లో విజయాన్ని కోరారు. గంగులయ్యకు అభినందనలు తెలిపిన వారిలో జనసేన పార్టీ నాయకులు సూర్ల వీరేంద్ర కుమార్, గబులంగి గణేష్, రఘువంశి,గాజుల శ్రీను, పోటుకూరి జయంత్, పాంగి శ్రీను, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.