పీఎం జన్ మన్ గృహ నిర్మాణాలను పరిశీలించిన విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు 

గూడెం కొత్త వీధి,పెన్ పవర్ ఆగస్టు 12:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం వంచుల పంచాయితీ కొడిసింగి గ్రామంలో ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు వంతల దేవదాసు కోడిసింగి గ్రామంలో పీఎం జన్ మన్ గృహ నిర్మాణాలను పరిశీలించారు. పీఎం జన్ మన్ గృహాలను లబ్ధిదారులు సక్రమంగా నిర్మించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు బిజెపి నాయకులు కార్యకర్తలు, గృహ నిర్మాణ శాఖ ఏఈ సెగ్గే సూరిబాబు, వర్క్ ఇన్స్పెక్టర్ చిట్టి పడాల్ తదితరులు పాల్గొన్నారు.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.