లోక్‌సభ ఎన్నికలు… సగం టికెట్లు నేర చరితులకే

Lok Sabha Elections… Half the tickets are for criminals

లోక్‌సభ ఎన్నికలు… సగం టికెట్లు నేర చరితులకే

సార్వత్రిక ఎన్నికల తొలిదశలో దాదాపు సగం స్థానాల్లో నేర చరితులే ఎక్కువగా పోటీ పడుతున్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్ విశ్లేషించింది. 

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల తొలిదశలో దాదాపు సగం స్థానాల్లో నేర చరితులే ఎక్కువగా పోటీ పడుతున్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్ విశ్లేషించింది. మొత్తం 102 స్థానాలకు గాను 42 సీట్లలో ముగ్గురు లేక అంతకంటే ఎక్కువ మంది నేర చరితులు ప్రధాన పార్టీల తరఫున ఎన్నికల బరిలో నిలిచారని తెలియజేసింది. 1618 మంది ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించింది.

అందులో 252 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, వారిలో 161 మందిపై తీవ్రమైన నేరాభియోగాలు ఉన్నాయని వెల్లడించింది. 35 మందిపై విద్వేష ప్రసంగాల కేసులు ఉన్నాయని, 41 శాతం సీట్లలో రెడ్ అలర్ట్ ప్రకటించారని పేర్కొంది. 28 మంది అభ్యర్థులు కోటీశ్వరులని, ఆర్‌జేడీ, డిఎంకె, ఎస్పీ, టిఎంసి అభ్యర్థుల్లో 40 శాతం మంది ఏదో ఒక నేరానికి పాల్పడిన వారేనని తెలిపింది.

About The Author

Related Posts

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల