అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో రేపు అనగా మంగళవారం ఉమ్మడి జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు చింతపల్లిలో పర్యటిస్తున్నట్లు అరకు పార్లమెంట్, పాడేరు అసెంబ్లీ జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ వంపూరు గంగులయ్య తెలిపారు. పంచకర్ల రమేష్ బాబు పర్యటన ఏర్పాట్లపై ఆయన సోమవారం చింతపల్లిలో జనసేన పార్టీ నాయకులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలిపారు. రేపు డిగ్రీ కాలేజ్ వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉల్లి సీతారాం, గొర్లె వీర వెంకట్, కొయ్యం బాలరాజు, బుజ్జి బాబు,పెదవలస సర్పంచ్ కృష్ణవంశీ, వసుపరి ప్రసాద్, సుర్ల వీరేంద్ర, చింతపల్లి,గూడెం కొత్త వీధి ఈ రెండు మండలాల జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
- పాలిటిక్స్
- విశాఖపట్నం / Visakhapatnam
- అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District
- స్థానిక రాజకీయాలు