జోరుగా బుర్రా తనయుడు లక్ష్మీనారాయణ విస్తృత ప్రచారం.

జోరుగా బుర్రా తనయుడు లక్ష్మీనారాయణ విస్తృత ప్రచారం.

 చిమిడితిపాడులో ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం.

మండలంలోని చిమిడితిపాడు పంచాయతీలో కందుకూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ రెండవ తనయుడు లక్ష్మీనారాయణ మంగళవారం జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో బుర్రా లక్ష్మీనారాయణ ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి, రానున్న ఎన్నికల్లో మరోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించి, మరింత అభివృద్ధికి సహకరించాలని కోరుతూ, ఇప్పటివరకు ప్రజలకు వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల కరపత్రాలను గడప గడపలో అందించి, తన తండ్రి ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ కు, ఎం.పీ అభ్యర్థి విజయసాయిరెడ్డి లకు ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని కోరారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేలా అర్హులందరికీ జగనన్న కాలనీలలో గృహాలను నిర్మించి సర్వహక్కులు పొందేలా రిజి స్ట్రేషన్ కూడా చేసి ఇచ్చిన ఘనత జగనన్నదని, అదే విధంగా నవరత్నాలతో పాటు వివిధ సంక్షేమ పథకాల అమలుతో బడుగు, బలహీన వర్గాలకు మేలు చేసిన వ్యక్తిని, జగనన్న ను మళ్లీ గెలిపించి, సంక్షేమ ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టాలని బుర్రా తనయుడు పిలుపునిచ్చారు. గడప గడపకు వెళ్లి ఆప్యాయంగా కుటుంబ సభ్యులను పలకరిస్తూ, సంక్షేమ పథకాల కరపత్రాలను చదివి వినిపిస్తూ, భరోసా కల్పిస్తూ నాయకులతో కలసి హుషారుగా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగనన్న ఆదేశాల మేరకు కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ తరుపున పోటీ చేస్తున్న తన తండ్రి బుర్రా మధుసూదన్ యాదవ్ కు గెలుపునకు మీ సహాయ సహకారాలు అందించి, తన తండ్రిని ఆదరించాలని బుర్రా తనయుడు గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో  సర్పంచ్ చిత్తారు హైమావతి, చిత్తారు మల్లికార్జునరావు, మాజీ సర్పంచ్ రాఘవ, చిట్యాల రవీంద్ర,వైస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక సభ్యులు బిల్లా రమణయ్య, కాపులూరి అశోక్ కుమార్, చిత్తారు నాగరాజు , యువకులు, వైసీపీ నాయకులు , అభిమానులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల