రేపు విద్యా సంస్థలకు అంగన్వాడీ కేంద్రాలకు సెలవు: జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్

స్టాప్ రిపోర్టర్,పాడేరు/ గూడెం కొత్త వీధి,పెన్ పవర్,ఆగస్టు 17: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాల కురుస్తున్న భారీ వర్షాల సందర్భంగా అన్ని విద్యాసంస్థలకు, అంగన్వాడీ కేంద్రాలకు  ఈ నెల 18వ తేదీన (సోమవారం) ఒకరోజు సెలవు ప్రకటించామని జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు ఒకరోజు పాఠశాలలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఆదేశాలను పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు. విద్యాశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.