అల్లవరం మండలం గూడాల గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మూడు కుటుంబాలు పూర్తిగా నిరాశ్రయులయ్యాయి. ఈ ప్రమాదంలో మూడు తాటాకు ఇళ్లు దగ్ధం అయ్యాయి. పక్కనే ఉన్న ఒక బిల్డింగ్ పాక్షికంగా దెబ్బతింది. అంతా ఘాఢ నిద్రలో ఉన్న సమయంలోi చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో పదిమంది ప్రాణాపాయం నుండి తృటిలో బయటపడ్డారు.
గూడాల లో అగ్నిప్రమాదం
అమలాపురం
నిరాశ్రయులైన మూడు కుటుంబాలు