రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సురేష్

రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సురేష్

 ఏప్రిల్, 10.
రంజాన్ పండుగ సందర్భంగా కొండెపి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి,రాష్ట్ర పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్  ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ
మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. అల్లా దీవెనలతో కొండెపి నియోజకవర్గ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు, ప్రపంచమానవాళికి సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని, దివ్య ఖురాన్ అవతరించిన ఈ
మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ముగింపు వేడుక అని మంత్రి సురేష్ పేర్కొన్నారు. క్రమశిక్షణతో ఉండటం, ఐకమత్యంతో మెలగటం, పేదలకు తోడ్పడటం ఈ పండుగ
మానవాళికి ఇచ్చే సందేశమని, మనిషిలోని చెడు భావనలను,
అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని మంత్రి సురేష్ తన సందేశంలో పేర్కొన్నారు.

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల