జీవీఎంసీ అవుట్ గేట్ దగ్గర ఫుడ్ ఇన్స్పెక్టర్ బృందం శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. పరిసర ప్రాంతాల్లో ఉన్న బిర్యానీ దుకాణాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలను పరిశీలిం చారు. అనుమానాస్పదంగా కనిపించిన కొన్ని నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపారు.నమూనాల పరీక్షల అనంతరం రిపోర్టు ఆధారంగా బిర్యానీ దుకాణాలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై చట్టరీత్య తగు చర్యలు తీసుకొనబడతాయని ఫుడ్ ఇన్స్పెక్టర్ బృందం పలికారు.