వర్షాలు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి:జిల్లా కలెక్టర్
  *👉అన్ని మండలాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయండి
*👉జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్
స్టాఫ్ రిపోర్టర్,పాడేరు/ గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై 13: జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో అధికారులు,సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు.ప్రతి మండలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ తన సూచనలు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. అనుకోని సంఘటనలు సంభవిస్తే కలెక్టర్ కార్యాలయమునకు తెలియజేయాలని ఆదేశించారు.ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని సూచించారు.
About The Author
                 అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.
