కూటమి నాయకుల్లారా...?ఈ రోడ్డును చూశారా..!బీటి రోడ్డు పూర్తి చేయాలి                                      

 అనంతగిరి, పెన్ పవర్ మార్చి13:ములియా గుడ గ్రామం మీదుగా మువ్వం వలస, లింబ గుడ, కుమ్మరి వలస, టోకూరు, గ్రామాల వరకు బీటీ రోడ్డు పూర్తి చెయాలని సీపీఎం మండల కార్యదర్శి కిల్లో మోస్య అన్నారు. గురువారం సీపీఎం ప్రజా చైతన్య యాత్ర లో భాగంగా కొండిభ పంచాయతీ మువ్వం వలస లింబగుడ గ్రామాలలో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018 సంవత్సరంలో ములియ గుడ మీదుగా మువ్వం వలస, లింబగుడ, కుమ్మరి వలస టోకూరు గ్రామాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో బీటీ రోడ్డు మంజూరు అయిందని, సుమారు ఆరు సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ రోడ్డు పనులు పూర్తి కాలేదని, అధికారులు, కాంట్రాక్టురు వీరి కారణంతో రోడ్డు పనిలో జాప్యం జరుగుతుంది, అటుగా రాకపోకలు సాగించే గ్రామస్తులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే రోడ్డు పనులు ప్రారంభంచాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో గ్రామస్తులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో కిల్లో దొన్ను, సమర్డి నందు, రఘు, గోపాల్ రాజు, పొత్తి డొంబు, రాము, గోపి, తదితరులు పాల్గొన్నారు.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.