రంపుల గ్రామ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ మరియు ఎమ్మెల్యేకు వినతి

IMG-20240705-WA0715
ఎమ్మెల్యేకు సమస్యలు వివరిస్తున్న గ్రామస్తులు

స్టాప్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై 5: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం రంపుల గ్రామంలో నున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం గ్రామస్తులు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ కు,ఎమ్మెల్యే యం. విశ్వేశ్వర రాజుకు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. రంపుల గ్రామం గుండా నిర్మిస్తున్న నేషనల్ హైవే కారణంగా పొలాలలో సాగు చేయలేని పరిస్థితి ఏర్పడిందని, హైవే నిర్మాణం వల్ల పొలాలకు అందే నీటి సదుపాయం కొరబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న గిరిజనులకు ఈ సమస్యను పరిష్కరించి సహాయం చేయాలని వినతి పత్రంలో కోరారు. అలాగే గ్రామంలో ఉన్న పాఠశాల భవనం శిధిలా వ్యవస్థకు చేరుకుందని, ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితిలో భవనం ఉందని, భయంతో పిల్లలు బిక్కుబిక్కుమంటూ చదువులు సాగిస్తున్నారని నూతన పాఠశాల బిల్డింగ్ మంజూరు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ కార్యదర్శి కంకిపాటి గిరిప్రసాద్, కంకిపాటి వీరన్నపడాల్, పోతురాజు హరిప్రసాద్, పోతురాజు సీతమ్మ,పొత్తూరు గోపాల్,నరేష్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 
భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు 
యూటిఎఫ్ సభ్యులుగా చేరి – ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించండి
దామనపల్లి ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ పీవో ఆకస్మిక తనిఖీ...విద్యార్థుల ప్రతిభపై పీఓ సంతృప్తి,