దామనపల్లిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,డిసెంబర్ 25:దామనపల్లి పంచాయతీ పరిధిలోని దామనపల్లి, నల్లబెల్లి, కట్టుపల్లి గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దామనపల్లి పంచాయతీ సర్పంచ్ కె. రామకృష్ణ పాల్గొన్నారు. నల్లబెల్లి గ్రామంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మూడు గ్రామాల పాస్టర్లను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సర్పంచ్ కె. రామకృష్ణ మాట్లాడుతూ ప్రభువైన యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని అన్నారు. బైబిల్‌లోని వాక్యాలను పాటిస్తూ సత్యమార్గంలో నడిచి, సమాజంలో శాంతి నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పాస్టర్లు, సంఘస్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలోఎస్. కర్రయ్య,ఎస్. సత్తిబాబు, కె. రాజారావు, చిట్టిబాబు, వి. చిట్టిబాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.