దారెలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు:భారత రాజ్యాంగంపట్ల అవగాహన కలిగి ఉండాలి:టీడీపీ డివిజన్ నాయకులు,దారెల సర్పంచ్ పాంగి పాండురంగస్వామి

ముంచంగిపుట్టు,పెన్ పవర్,ఆగస్టు15:ముంచంగిపుట్టు మండలం, దారేల పంచాయతి కేంద్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాడేరు డివిజన్ టీడిపి నాయకులు, దారెల పంచాయతి సర్పంచ్ పాంగి పాండురంగాస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి వుండాలని,స్వాతంత్ర్యానికి ముందు భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే వారని, నాడు భారతీయులు దోపిడీకి అణిచివేతకి గురయ్యారన్నారు. ఎంతోమంది మహానుభావులు, పోరాట యోధుల ఆత్మ బలిదానమే నేటి స్వాతంత్ర దినోత్సవం అని, నేటి సమస్యల పరిష్కారానికి నాటి పోరాటయోధులే ఎంతో స్ఫూర్తి దాయకమన్నారు.భారత రాజ్యాంగాని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే అని ఆర్టికల్ 25 ప్రకారం నచ్చిన దైవాన్ని, నచ్చిన మతాన్ని నమ్ముకోవచ్చన్నారు. ఆర్టికల్ 51 ప్రకారం రాజ్యాంగ సంస్థలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పించిందని, ఆర్టికల్ 4 ప్రకారం గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం ద్వారా స్వయం పరిపాలన వ్యవస్థను ప్రోత్సహించే విధంగా రాజ్యాంగం హక్కులను కల్పించిందన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరగాలని బ్రిటిష్ పరిపాలన నుండి భారతీయులకు విముక్తి కలిగించి భారత రాజ్యాంగంలో అనేక హక్కులు, చట్టాలు,దళిత, గిరిజన బడుగు బలహీన వర్గాలకు అనేక అవకాశాలు కల్పించిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దక్కుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ మధు, జనసేన నాయకులు నాగేష్, వార్డు మెంబర్లు, కేశవ్, రామకృష్ణ, రామన్న, గ్రామ నాయుడు సాంగ్ వైకుంఠ రావు, దేవేంద్రుడు, కవిత్యా, దామోదరం, ఆనంద్,గోపాలం, రాము సచివాలయ సిబ్బంది తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.