గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఫిబ్రవరి10: ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో గూడెం కొత్త వీధి మండలంలోని వెలుగు కార్యాలయంలో వివోఏ సిబ్బంది అధికారులకు సమ్మె నోటీసు అందజేశారు.ఈ సందర్భంగా వెలుగు యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు శోభన్ బాబు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరారు. అదే సమయంలో, వెలుగు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఫిబ్రవరి 12వ తేదీన జరిగే సమ్మెలకు సిద్ధంగా ఉండాలని శోభన్ బాబు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల వెలుగు యూనియన్ అధ్యక్షులు, కార్యదర్శులు, పుష్ప రామలింగం తదితరులు పాల్గొన్నారు.