కాకినాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

కాకినాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

కాకినాడ

 కాకినాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పీతల అచ్యుత రామారావు ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు శ్రీ కోధి నామ ఉగాది పండుగను ఘనంగా నిర్వహించారు. ఉగాది పంచాగాన్ని ప్రముఖ జ్యోతిష్యులు సాయి సుబ్బారావు  ప్రెస్ క్లబ్ ఆహ్వానం మేరకు విచ్చేసి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో సభ్యులందరికీ తెలియజేశారు. ఈ సందర్భంగా పీతల అచ్యుతరామారావు మాట్లాడుతూ కాకినాడ ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు మూడవసారి ఉగాది పండుగ వేడుకలను నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని, సర్వ మతాలకు అతీతంగా ప్రతి పండుగను ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి వేడుకకు సభ్యులందరూ హాజరై విజయవంతం చేయడం మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని, రాబోవు రోజులలో ప్రెస్ క్లబ్ మరింత ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. జర్నలిస్టు మిత్రులందరు సుఖ సంతోషాలతో ఉండాలని, అతి త్వరలోనే జర్నలిస్టు మిత్రులందరికీ ఒక మంచి కార్యక్రమం నిర్వహించబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో  ప్రధాన కార్యదర్శి గునుపే శోభన్ బాబు, ట్రెజరర్ కోనేటి శ్రీనివాసరావు, అడ్వైజరీ కమిటీ  వీధి గోపీనాథ్, సికోటి త్రిమూర్తులు, జాయింట్ సెక్రెటరీ పుర్రెత్రినాథ్, మోర్త బాల కుమార్, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల