అనపర్తి లో పార్థివ శివలింగాలు తయారీ .
            By  Admin              
On  
అనపర్తి ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అమలాపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం వారి నేతృత్వంలో అనపర్తి శ్రీ వాసవి ఆదర్శ వనిత క్లబ్ వారి ఆధ్వర్యంలో బుధవారం నాడు పార్థివ శివలింగాల తయారీకి శ్రీకారం చుట్టారు. తొలుత గణపతి పూజతో ప్రారంభించి భక్తులచే సామూహికంగా అచ్చులతో శివలింగాలు చేయించుటకు 15 రోజులు వ్యవధిలో రెండు లక్షల శివలింగాలు తయారు చేయుటకు సంకల్పించారు. ఈ కార్యక్రమానికి అనపర్తి స్థానిక శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పోతంశెట్టి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో శ్రీ వాసవి ఆదర్శ వనితా క్లబ్ ప్రతినిధి గ్రంధి సుజాత బృందం, నాగమణి టీచర్ తదితరులు పాల్గొన్నారు.
Tags:  #womenpower#prakasam

 
                  
          
          
          
          
                 
                 
                 
                 
                 
                 
                