సలహాదారులకు కోట్లు కుమ్మరిస్తూ, పూలే జయంతి నిర్వహణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని జగన్

మహాత్మ జ్యోతిరావు ఫూలేను అవమానించిన జగన్

సలహాదారులకు కోట్లు కుమ్మరిస్తూ, పూలే జయంతి నిర్వహణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని జగన్

దళిత నీలం నాగేంద్ర ఆగ్రహం

వందలాది మంది సలహాదారులకు జీతభత్యాల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కుమ్మరిస్తున్న జగన్, మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి నిర్వహణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఒంగోలులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాగేంద్ర మాట్లాడుతూ, బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ కృష్ణమోహన్  అందుబాటులో ఉన్న నిధులతో పూలే జయంతి వేడుకలు జరపాలని కోరటం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ కృష్ణమోహన్ తేదీ 03/04/ 2024 గాగల మెమో నంబర్ బిసిడబ్ల్యు01-జనరల్/21/204-బి ద్వారా జ్యోతిరావు పూలే 198 వ జయంతి వేడుకలను రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 భారతరత్న బిఆర్ అంబేద్కర్ జయంతి నిర్వహణకు లక్ష రూపాయలు, ఏప్రిల్ 5 జగజ్జీవన్ రామ్ జయంతి నిర్వహణకు లక్ష రూపాయలు కేటాయించిందన్నారు. ప్రపంచ మేధావి అంబేద్కర్ కే గురువైన మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలకు జగన్ నిధులు ఇవ్వకపోవడం బీసీల పట్ల వివక్ష చూపటమేనన్నారు. జ్యోతిరావు పూలే జయంతి వేడుక నిర్వహణకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించకపోవడం, జ్యోతిరావు పూలేను అవమానించటమేనని నాగేంద్ర మండిపడ్డారు. జ్యోతిరావు పూలే జయంతి వేడుకను రాష్ట్ర ఉత్సవంగా జరపాలని కోరిన బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ కృష్ణమోహన్, బీసీ సంక్షేమ శాఖకు బడ్జెట్ కేటాయించ లేదనే విషయం తెలిసి కూడా,  అందుబాటులో ఉన్న నిధులతో ఫూలే జయంతి వేడుకను జరపాలని కోరటం విడ్డూరంగా ఉందన్నారు. జ్యోతిరావు పూలే విగ్రహానికి దండలు వేసి, మొక్కుబడిగా జరిపే జయంతి వేడుక రాష్ట్ర ఉత్సవం కాబోదని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించాలన్నారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని పదే పదే చెప్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లకు సైతం నిధులు కేటాయించలేదన్నారు. కానీ బ్రాహ్మణ, వైశ్య, కమ్మ, రెడ్డి కార్పొరేషన్లకు కోట్లాది రూపాయలు నిధులు ఇచ్చారన్నారు. పూలే జయంతి వేడుకలకు నిధులు కేటాయించాలని, ఒక్క సలహాదారు కూడా సలహా ఇచ్చినట్టు లేదన్నారు. జగన్ నియమించుకున్న సలహాదారుల్లో ఒక్కరు కూడా  ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన వారు లేరన్నారు. 198 వ మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుక నిర్వహణ పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, భాధ్యతారాహిత్యం, వివక్షలపై ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలని నాగేంద్రరావు డిమాండ్ చేశారు. 

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల