అవాంచనీయ సంఘటనల నివేదికకు టోల్ ఫ్రీ నంబర్: 18004256826 – కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్
స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,మే 5: రానున్న నాలుగు రోజుల పాటు వాతావరణ శాఖ భారీ వర్షాలు, పెనుగాలుల హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, జిల్లాలో ప్రజల భద్రత దృష్ట్యా పాడేరు కలెక్టరేట్‌లో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ తెలిపారు.
ఈ నెల 5వ తేదీన పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని, గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. అలాగే 6, 7, 8 తేదీలలో కూడా అల్పం నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందన్నారు.
ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అన్ని శాఖల అధికారులు తమ కార్యాలయాలలో హాజరై విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు.
విపత్తులకు సంబంధించి సమాచారాన్ని తెలియజేయడానికి టోల్ ఫ్రీ నంబర్ 18004256826 నందు సంప్రదించవచ్చని కలెక్టర్ సూచించారు. ఈ కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వహించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారని, తహసిల్దార్ స్థాయి అధికారులను పర్యవేక్షణకు కేటాయించినట్టు వెల్ల