జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరిని కలిసిన జనసేన నేతలు 

జానపద కళలు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డాక్టర్ వంపూరు గంగులయ్య సారాద్యంలో

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఫిబ్రవరి 4: మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరిని రాష్ట్ర జానపద కళలు మరియు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డాక్టర్ వంపూరు గంగులయ్య సారాధ్యంలో గూడెం కొత్త వీధి, చింతపల్లి మండలాల జనసేన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి ఉల్లి సీతారాం, అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొర్లె వీర వెంకట్, గూడెం కొత్త వీధి మండల జనసేన పార్టీ అధ్యక్షులు కొయ్యం బాలరాజు, సీనియర్ జనసేన పార్టీ నాయకులు సుర్ల వీరేంద్ర కుమార్, గాజుల శ్రీను, కూడా రామకృష్ణ,గబులంగి గణేష్, పాంగి శ్రీను, గుండ్ల రఘువంశీ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.