ఎన్నికల నిబంధనలు ఉల్లoఘిoచిన అనపర్తి ఎమ్మెల్యే భార్య ఆదిలక్ష్మి

ఎన్నికల నిబంధనలు ఉల్లoఘిoచిన అనపర్తి ఎమ్మెల్యే భార్య ఆదిలక్ష్మి

అనపర్తి నియోజకవర్గoలో ఎన్నికల నిబంధనలు ఉల్లoఘిoచి   ప్రార్థనా మందిరాలలో ఎన్నికల ప్రచారం చేస్తున్న అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి  భార్య ఆదిలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని  అనపర్తి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వారికి ఫిర్యాదు చేశానని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం అనపర్తి తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆయన విలేకరులతో మాట్లాడుతూ అనపర్తి నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుత ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి  భార్య ఆదిలక్ష్మి  ఎన్నికల ప్రచార కార్యక్రమాలో పాల్గొంటున్నారు. వివిధ గ్రామాలలో క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో (చర్చిలు) సమావేశాలు ఏర్పాటు చేసి, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి సూర్య నారాయణరెడ్డిని గెలిపించమని ప్రచారం చేయుచున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ప్రార్థనా మందిరాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదు.
అనపర్తి మండలం అనపర్తి, పెదపూడి మండలం కైకవోలు చర్చిలలో ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యమని ప్రచారం నిర్వహించారు. ఆయా చర్చిలలో జరిగిన ప్రచార కార్యక్రమం వీడియోలను సిడి రూపంలో అందిoచడం జరిగిందన్నారు. ఎన్నికల నిబంధనలు బేఖతారు చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న  ఆదిలక్ష్మిపై తగు చర్యలు తీసుకోవలసినదిగా ఎన్నికల కమిషనర్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో అనపర్తి టౌన్ నాయకులు పాల్గోన్నారు.

About The Author

Advertisement

LatestNews

ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 
భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు 
యూటిఎఫ్ సభ్యులుగా చేరి – ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించండి