దామనపల్లి ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ పీవో ఆకస్మిక తనిఖీ...విద్యార్థుల ప్రతిభపై పీఓ సంతృప్తి,

👉🏻ఉపాధ్యాయుల కొరతపై త్వరిత పరిష్కారని హామీ...

👉🏻రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్ట సింహాచలం....

👉🏻దేవీపట్నం,పెన్ పవర్,జూలై1:

దేవీపట్నం మండలంలోని దామనపల్లి ఆశ్రమ పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో మంగళవారం ఐటీడీఏ రంపచోడవరం ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ప్రధానోపాధ్యాయులు బి.చంద్రకళ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి.వంటశాలను పరిశీలించిన పీఓ,విద్యార్థులకు పోషకాహారంతో కూడిన ఆహారం అందించాలని,మెనూను తప్పనిసరిగా పాటించాలని డిప్యూటీ వార్డెన్‌ను ఆదేశించారు.అనంతరం తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడి వారి నైపుణ్యాలను పరీక్షించారు.గణిత శాస్త్రంలో విద్యార్థులు ఇచ్చిన సమాధానాలు పీఓకు నచ్చగా,అర్థవంతమైన బోధనకుగాను గణిత ఉపాధ్యాయురాలు బేబీ కుమారిని ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించిన పీఓ,విద్యార్థులకు మెరుగైన విద్య,వైద్యం,ఆహారం కల్పించాలన్నారు.జూనియర్ కళాశాల విద్యార్థులతో మాట్లాడిన ఆయన,ఉపాధ్యాయుల కొరతపై వచ్చిన ఫిర్యాదులకు స్పందిస్తూ,వారం పదిరోజులలో తగినంత ఉపాధ్యాయులను నియమిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ వార్డెన్ బేబీ రోహిణి, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.