కెందుగూడ పాఠశాలకు రూ.15లక్షలు: మంత్రి సంధ్యారాణి

ముంచంగిపుట్టు,పెన్ పవర్

Gummadi_sandhya_rani
మంత్రి గుమ్మడి సంధ్య రాణి

,జూలై10:ముంచంగిపుట్టు మండలం కుమడ పంచాయతీ కెందుగూడ పాఠశాల భవన నిర్మాణానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రూ.15లక్షలు మంజూరు చేశారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.ముంచంగిపుట్టు మండలం మారుమూల కుమడ పంచాయితీకీ చెందిన కేందుగూడ గ్రామ పాఠశాలలో విద్యార్థుల చదువు నిమిత్తం తల్లి దండ్రులు శ్రమాధానంతో రేకుషేడు నిర్మించిన విషయాని వివిధ వార్త పత్రికలలో, సమాచార మాధ్యమాలలో ప్రచురితమైన విషయం తెలిసిందే.వీటిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పాఠశాల నిర్మాణం కొరకు 15 లక్షల రూపాయలు మంజూరు చేశారు.ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఇవేకాకుండా పక్కా భవనాలు లేని 408 పాఠశాలలు గుర్తించినట్లు మంత్రి తెలిపారు.వాటి నిర్మాణానికి రూ.56 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రభుత్వ మంజూరుకు సమర్పించామన్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల