కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామం సమీపంలోని మంగమూరు హైవేలో ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుంచి కారు బలంగా ఢీకొట్టడంతో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు విషయం తెలుసుకున్న కావలి పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీయుటకు కావలి రెడ్ క్రాస్ బృందం వారు సహాయ, సహకారాలు అందిస్తున్నారు. మృతి చెందిన వారు కావలి డివిజన్ పరిధిలోని జలదంకి మండలం చామదల గ్రామానికి చెందిన వారిగా సమాచారం. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కావలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పి వెంకటరమణ తెలిపారు.
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు ఐదుగురు మృతి.
కావలి