పొదిలి మండలంలో పోలింగ్ బూతులను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనా

పొదిలి మండలంలో పోలింగ్ బూతులను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనా

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గురువారం నాడు పొదిలి మండలంలోని పలు గ్రామాల్లో గల పోలింగ్ బూతులను మార్కాపురం సబ్ కలెక్టర్ మరియు రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనా పరిశీలించారు ఈ సందర్భంగా మండలంలోని మూగచింతల, కొండాయపాలెం, దొండలేరు, నంది పాలెం, పోతవరం, కంబాలపాడు గ్రామాల్లో ఎంపిక చేసిన పోలింగ్ బూత్ లను ఆయన పరిశీలించారు అలాగే ఆయా పోలింగ్ బూత్ లకు మౌలిక సదుపాయాలు గురించి క్షుణ్ణంగా పరిశీలించారు అలాగే ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ బూత్ లు ఓటింగ్ కు ఏమేరకు సౌకర్యంగా ఉంటాయో సబ్ కలెక్టర్ రాహుల్ మీనా పరిశీలించడంతోపాటు పలు విషయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు ఆయన వెంట పొదిలి పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ డి మల్లికార్జున రావు, పొదిలి పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ జి కోటయ్య, పొదిలి మండల తహసిల్దార్ మహమ్మద్ జియా ఉల్ హక్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కే సుబ్బారావు తదితరులు ఉన్నారు

About The Author

Advertisement

LatestNews

ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 
భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు 
యూటిఎఫ్ సభ్యులుగా చేరి – ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించండి
దామనపల్లి ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ పీవో ఆకస్మిక తనిఖీ...విద్యార్థుల ప్రతిభపై పీఓ సంతృప్తి,