అన్న విజయం కొరకు చెల్లెలు రెండవ రోజు ఇంటింటిప్రచారం

అన్న విజయం కొరకు చెల్లెలు రెండవ రోజు ఇంటింటిప్రచారం

బేస్తవారిపేట గ్రామపంచాయతీ పరిధిలోని కాలువ బజార్ , చాకలి బజార్ లో గిద్దలూరు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి చెల్లెలు చిట్యాల గీతా భవాని బుదవారం ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా గీతా భవాని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి అధికారంలోనికి వచ్చాక బీసిలకు చేసిన అన్యాయాలను  అబద్దపు హామీలతో అధికారంలోకి బీసీ సోదరులకు చేసిందేమి లేదన్నారు.రాష్ట్రంలో అన్నీ వర్గాల ప్రజలను దోచుకోవటమే పనిగా పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు టీడీపీ, జనసేన, బిజెపి పార్టీలు ఉమ్మడిగా చేసే పోరాటంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు బాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను వివరించి గ్రామంలో ఇంటింటికి తిరిగి త్వరలో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి గిద్దలూరు అభ్యర్థిఅశోక్ రెడ్డిని మరియు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బెస్తవారిపేట మండల టిడిపి అధ్యక్షులు సోరెడ్డి మోహన్ రెడ్డి, జేబీకే పురం ఎంపిటిసి సభ్యులు కోనూరు భూపాల్ రెడ్డి,ముపూరి రాము, బెస్తవారిపేట 7వార్డు మెంబర్ దూదేకుల శివ, బీసుఅరుణ్ కుమార్,అనుముల కిషోర్, అవ్వారి వెంకటేశ్వర్లు,దూదేకుల నాగూర్, పటాన్ ఉస్మాన్ ఖాన్ , పల్ల శ్రీనివాసులు, దూదేకుల సైదులు, సందు రమేష్, మరియు బూత్ ఇంచార్జ్ లు, ముఖ్య నాయకులు, స్థానిక కార్యకర్తలు పాల్గోన్నారు.

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల