కేజీహెచ్ వైద్యుల నైపుణ్యానికి మరో ముద్ర పడ్డది
అరుదైన శస్త్రచికిత్స విజయవంతం
నూతన శిశువు ప్రాణాలు కాపాడిన వైద్య బృందం
జకొత్తూరు గ్రామం, జమాడుగుల మండలానికి చెందిన వండలము శ్రీనివాస్ సత్యవతి దంప తులకు ఆగస్టు 31న గెమిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆడ శిశువు జన్మించింది. పుట్టుకతోనే శిశువు తల వెనుక భాగంలో గడ్డ ఉండటంతో అక్కడి వైద్యులు వెంటనే కింగ్ జార్జ్ ఆసుపత్రి కే.జీ.హెచ్, విశాఖపట్నానికి రిఫర్ చేశారు. అక్కడ ఎం.ఆర్.ఐ స్కాన్‌లో శిశువుకు జెయింట్ ఆక్సిపిటల్ మెనింగోఎన్సెఫలోసీల్ ఉన్నట్లు గుర్తించారు. కేజీహెచ్ న్యూరో సర్జరీ విభాగాధిప తి డా. యం. జతరే ఆధ్వర్యంలో న్యూరో సర్జన్ల బృందం సెప్టెంబర్ 6న క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించింది.వైద్యులు తెలిపారు. ఇటువంటి జన్యుపరమైన వ్యాధులు పది వేల మందిలో ఒకరికి మాత్రమే వస్తాయని. చాలా మంది శిశువులు పుట్టిన వెంటనే లేదా ఆపరేషన్ తర్వాత ప్రాణాలు కోల్పోతారని చెప్పారు. ఈ శిశువుకు చేసిన శస్త్రచికిత్స పూర్తి విజయవంతమైందని, బయటకు వడ్తిన మెద డు భాగాన్ని తొలగించి తలను సాధారణ స్థితికి తీసుకువచ్చామని వైద్యులు వివరించారు.
శిశువు ప్రస్తుతం కోలుకుంటుందని, అయితే భవిష్యత్తులో డెవలప్మెంటల్ మైల్స్టోన్స్ డిలే, హైడ్రోసెఫాలస్ వంటి సమస్యలు తలెత్తే అవకా శం ఉండటంతో ప్రతి నెలా న్యూరో సర్జరీ ఓపీలో క్రమం తప్పకుండా ఫాలోఅప్ అవసరమని సూచించారు.
ఈ విజయవంతమైన శస్త్రచికిత్సలో భాగమైన న్యూరో సర్జరీ, అనస్థీషియా విభాగ వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని కేజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఐ. వాణి, డిప్యూటీ సూపరింటెండెంట్ డా. డి. రాధాకృష్ణ, సీనియర్ ఎం.ఓ డా.యు.శ్రీహరి, నర్సింగ్ సూపరింటెండెంట్ సి. హెచ్.పద్మావతి అభినందించారు.