వాడపల్లి వెంకన్న ఆలయ అభివృద్ధికి లక్ష రూపాయలు విరాళం

వాడపల్లి వెంకన్న ఆలయ అభివృద్ధికి లక్ష రూపాయలు విరాళం

కోనసీమ తిరుపతగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి సమేతంగా కొలువై ఉన్న స్వయంభు క్షేత్రానికి భక్తులు తరలివస్తున్నారు. బుధవారం ఆలయ అభివృద్ధికి లక్ష రూపాయలు విరాళంగా అందించారు.  ఏడువారాల వెంకన్న దేవునిగా భక్తుల కోరిన కోరికలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ చందన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి రావులపాలెం మండలం పోడగట్లపల్లి గ్రామానికి చెందిన బడే రవికుమార్ రమా సత్య దేవి దంపతులు  స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు, అనంతరం ఆలయ సన్నిధిలో నూతనంగా నిర్మిస్తున్న అన్నదాన భవన నిర్మాణానికి లక్ష రూపాయలు విరాళంగా అందించారు. వీరిని ఆలయ అర్చకులు వేదమంత్రోత్సవంతో ఆశీర్వచనాలు అందించగా  ఆలయ డిప్యూటీ కమిషనర్ భూపతి రాజు కిషోర్ కుమార్ స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల