ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలి
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు గ్రామాలలో ప్రశాంతంగా జరిగే విధంగా ప్రజలు సహకరించాలని బేస్తవారిపేట ఎస్సై నరసింహారావు ప్రజలను కోరారు. గ్రామాలలో సందర్శనలో భాగంగా మండలంలోని సలకలవీడు గ్రామంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై నరసింహారావు గ్రామ ప్రజలతో మాట్లాడుతూ త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపడుతుందన్నారు.ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు ప్రజలు తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఎన్నికల ప్రశాంత వాతావరణానికి ఎటువంటి భంగం కలిగించినా, అందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, గ్రామాల్లో శాంతిభద్ర తలకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా, వెంటనే తమ దృష్టికి తీసుకొని రావాలని ఎస్సైనరసింహారావు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

 
                  
          
          
          
          
                 
                 
                 
                 
                 
                 
                