చింతపల్లి ఐటిఐ లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం: ప్రిన్సిపల్ శ్రీనివాస చారి
స్టాఫ్ రిపోర్టర్,చింతపల్లి, గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఏప్రిల్30: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ప్రభుత్వ ఆర్ఐటిఐలో మొదటి విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా ఆహ్వనిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస చారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు, చింతపల్లి ఐటిఐ నందు ఎలక్ట్రీషియన్ -40, మెకానిక్ మోటార్ వెహికల్ -24, ఫిట్టర్ -20, వెల్డర్ -40, ప్లంబర్ -24, వుడ్ వర్క్ టెక్నీషియన్ -24, స్టెనోగ్రాఫర్ -24 సీట్లు ఉన్నాయని ఆసక్తి కలవారు iti.ap.gov.in నందు మే 24 లోపల దరఖాస్తులు చేసుకోవాలని,దరఖాస్తు చేసిన వారు ఎదైనా సమీప ప్రభుత్వ ఐటిఐలలో పని దినాలలో ఒరిజినల్ ధ్రువపత్రాలు తీసుకొని వెళ్ళి మే 26 లోపల వెరిఫికేషన్ చేయించుకోవాలి అన్నారు.కౌన్సెలింగ్ జూన్ మొదటివారం లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.మరిన్ని వివరాలకు 9866108607,9494377833 నంబర్లకు సంప్రదించాలి అన్నారు.
About The Author

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.