రేపు పాడేరు డివిజన్ లో విద్యా సంస్థలకు స్థానిక సెలవు:జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్
👉🏻రంపచోడవరం, చింతూరు డివిజన్లలో పోలింగ్ కేంద్రాలుగా ఉన్న సంస్థలకు స్థానిక సెలవు
స్టా
ప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,ఫిబ్రవరి 26:ఈ నెల 27వ తేదీన శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం జిల్లాల ఉపాధ్యాయ నియోజక వర్గానికి ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో పాడేరు డివిజన్లో ఉన్న అన్ని విద్యా సంస్థలకు స్థానిక సెలవు దినంగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసారు. అదేవిధంగా తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల పట్టబద్రుల నియోజక వర్గానికి ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో రంపచోడవరం,చింతూరు డివిజన్ల ఫరిధిలో పోలింగ్ కేంద్రాలుగా కేటాయించిన భవనాలు ఉన్న సంస్థలకు స్థానిక సెలవుగా కలెక్టర్ ప్రకటించారు.
About The Author
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.
